సీపీఐకి కొత్తగూడెం..రెండు ఎమ్మెల్సీలు

  • By: Somu |    telangana |    Published on : Nov 06, 2023 12:46 PM IST
సీపీఐకి కొత్తగూడెం..రెండు ఎమ్మెల్సీలు
  • రేవంత్‌, నారాయణ, కూనంనేని చర్చల్లో నిర్ణయం


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ-కాంగ్రెస్ పొత్తుతో సాగాలని నిర్ణయించుకున్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ , రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, కూనంనేనిలు ప్రకటించారు. సోమవారం రెండు పార్టీల పొత్తు, సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరిపి తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిపారు. ఈ మేరకు వారు కలిసి మీడియాతో మాట్లాడారు. సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం, ఎన్నికల అనంతరం రెండు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందన్నారు.


ఎన్నికల ప్రచారం కోసం రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయణ మాట్లాడుతూ ఎన్ని సీట్లు ఇచ్చారని కాదని, తెలంగాణలో నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ పాల నుంచి విముక్తి సాధనే తమకు ముఖ్యమన్నారు.