డబ్బులు పంచుతున్న బీఆరెస్ కౌన్సిలర్ వీడియో

- కేటీఆర్‌పై కాంగ్రెస్ విమర్శల దాడి
విధాత : సిరిసిల్ల బీఆరెస్ ప్రజాశీర్వాద సభకు వచ్చిన వారికి సిరిసిల్ల బీఆరెస్ కౌన్సిలర్ డబ్బులు పంచుతున్న వీడియో ఆధారంగా మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ విమర్శల దాడి సాగిస్తుంది. కేటీఆర్ సభకు వచ్చిన వారికి టోకెన్లు పంపిణీ చేసి, వాటిని చూపిన వారికి 200 రూపాయిలు పంపిణీ చేస్తుండగా తీసిన వీడియో వైరల్‌గా మారింది.
మంత్రి కేటీఆర్ నియోజకవర్గం, సిరిసిల్లలో డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ కెమెరాకు చిక్కారు.
మధ్యాహ్నం 200 రూపాయిల టోకెన్ టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన వారికి ఇచ్చారు, సభ తర్వాత ఒక్కొక్కరికి బీఆర్ఎస్ కౌన్సిలర్ 200/- పంపిణీ చేశారు.
ఇటీవలే మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…… pic.twitter.com/9vpIdMoSw2
— Congress for Telangana (@Congress4TS) October 17, 2023
ఇంకేముంది.. ఇటీవలే మంత్రి కేటీఆర్ “సిరిసిల్లలో డబ్బులు పంచను.. మద్యం పోయించను” అంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు వైరల్‌గా మార్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.