కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ నేతల భేటీ మంత్రి.. పొన్నం నివాసంలో ఆత్మీయ కలయిక
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహారించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఆత్మీయ భేటీ నిర్వహించారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహారించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఆత్మీయ భేటీ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఆదివారం పార్టీ తెలంగాణ ఉద్యమ నేతలు, మాజీ ఎంపీల ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ నేతలంతా రాష్ట్ర సాధనలో ఆనాడు జరిగిన పరిణామాలు, ఘటనలు, పోరాటాలను స్మరించుకున్నారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మేల్యేలు వివేక్ వెంకట్ స్వామి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్ ప్రభృతులు పాల్గొన్నారు. వారందరిని శాలువలతో పొన్నం సన్మానించి సత్కరించారు.