విధాత: తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రా రంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కే సీ ఆర్) అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. సమావే శంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చిస్తున్నారు. మొదట కొవిడ్ పరిస్థితి పై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్రాల్లో కరో నా స్థితి గతులు, కట్టడి చర్యలపై వైద్యాధికారులు మంత్రి వర్గానికి వివరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసు కున్నారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం కరోనా కేసుల్లో పెరుగుదల లే దని, మహమ్మారి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అం దుబాటులో ఉంన్నాయని చెప్పారు. ఇప్పటివరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుంచి ప్రారంభమైందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని మంత్రివర్గం తెలిపింది. ఇందులో భాగంగా రోజుకు 3 లక్షల టీకాలు వేసేలా పూర్తి సన్నద్దతతో ఉండాలని మంత్రివర్గం నిర్దేశించింది. కొత్త వైద్య కళాశాలలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌అండ్‌బీ, వైద్యారోగ్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ ఏర్పాటుపై సమీక్షించారు. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, మరింత పెంచి 550 గతంలో 130 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. రూ..133 కోట్లతో బెడ్స్, మందులు, ఇతర సామగ్రిని, చిన్నపిల్లల వైద్యం కోసం 5,200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు వివరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్దికి సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని వైద్య శాఖాధికారులను ఆదేశించింది.
అదుపులోనే కరోనా.. మూడో వేవ్ వస్తే సర్వం సిద్ధం
<p>విధాత: తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రా రంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కే సీ ఆర్) అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. సమావే శంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చిస్తున్నారు. మొదట కొవిడ్ పరిస్థితి పై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్రాల్లో కరో నా స్థితి గతులు, కట్టడి చర్యలపై వైద్యాధికారులు మంత్రి వర్గానికి వివరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసు కున్నారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు