CPI  narayana Slams BJP |  రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం.. అధికారాన్ని కేంద్రీకృతం చేసే చర్యలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, నీతి అయోగ్‌ తదితర వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేయనివ్వడంలేదని విమర్శించారు.

CPI  narayana Slams BJP |  రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం.. అధికారాన్ని కేంద్రీకృతం చేసే చర్యలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

CPI  narayana Slams BJP | స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, నీతి అయోగ్‌ తదితర వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేయనివ్వడంలేదని విమర్శించారు. చివరకు ప్రధానమంత్రి కార్యాలయం ఏది చెబితే రాష్ట్రపతి భవన్‌ అది చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను, ప్రయోజనాలను కాపాడడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మేడ్చల్‌ జిల్లా ‘కామ్రేడ్‌ పొట్లూరి నాగేశ్వర రావు నగర్‌’ (గాజుల రామారం), ‘కామ్రేడ్‌ ఎన్‌.బాలమల్లేశ్‌ హాల్‌’లో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలో రెండవ రోజు ప్రతినిధుల సభలో ఆయన ప్రసంగించారు. భారత పార్లమెంటరీ వ్యవస్థను కుదించి నాశనం చేయడం ద్వారా దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని నారాయణ విమర్శించారు. 30 రోజులు జైలులో ఉంటే చట్టసభల పదవులను రద్దు చేసేందుకు చట్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

అమెరికాకు ఎందుకు భయపడాలి?

అంతర్జాతీయ స్థాయిలో అమెరికా బెదిరింపు, బ్లాక్‌మెయిల్‌ ధోరణిని అవలంబిస్తున్నదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం.. అమెరికాకు భయపడాల్సిన అవసరం ఏమిటని నారాయణ ప్రశ్నించారు.