TELANGANA ASSEMBLY | అసెంబ్లీలో దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు, క్షమాపణలు: బీఆరెస్ వాకౌట్‌

హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి హైడ్రాపై అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న దానం నాగేందర్ బీఆరెస్ ఎమ్మెల్యేలపై తీవ్ర పదజాలంతో విరుచుకపడ్డారు. దానం మాట్లాడటం మొదలుపెట్టకగానే ఆయన ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారంటూ

TELANGANA ASSEMBLY | అసెంబ్లీలో దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు, క్షమాపణలు: బీఆరెస్ వాకౌట్‌

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి హైడ్రాపై అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న దానం నాగేందర్ బీఆరెస్ ఎమ్మెల్యేలపై తీవ్ర పదజాలంతో విరుచుకపడ్డారు. దానం మాట్లాడటం మొదలుపెట్టకగానే ఆయన ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారంటూ ఆయనకు అవకాశమివ్వరాదంటూ బీఆరెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన దానం బీఆరెస్ సభ్యులను ఉద్ధేశించి నీయమ్మ హైదరాబాద్‌లో తిరగనీయ కొడుకుల్లారా….ఏమనుకుంటున్నారు..అరేయ్ తోలు తీస్తా..బయట కూడా తిరుగనివ్వనంటూ తీవ్రంగా హెచ్చరించారు. నాటకాలు అడుతుతున్నారా? అంటూ మండిపడ్డారు. దానం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆరెస్‌ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. ఇది మంచి సంప్రదాయం కాదని, తక్షణమే దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. స్పీకర్ అభ్యర్థనతో స్పందించిన దానం నాగేందర్ బీఆరెస్ ఎమ్మెల్యేలే నన్ను కవ్వించారని,అయినా నేను పరిధిలోనే మాట్లాడానని, సీనియర్ సభ్యుడిగా నేను నోరు జారలేదని, ఎవరి పేరుతో విమర్శలు చేయలేదన్నారు. హైదరాబాద్‌లో సర్వసాదరణంగా మాటలే అన్నానన్నారు. నేను మాట్లాడిన మాటలు సభలోని సభ్యులకు బాధ కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. చీఫ్ మినిస్టర్ రేవంత్‌రెడ్డిని చీప్ మినిస్టర్ అన్నది కేటీఆర్ అని, అయినా వారి ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నానని, సబితక్కపై అందరికి గౌరవం ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఐటీ మంత్రిగా తాను ఏదో గొప్ప చేశానని చెప్పుకునే కేటీఆర్ సభలో, బయట సీఎంను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అయినా నేను సభలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. దానం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. ఎవరినో కించపరిచాలన్నది నా ఉద్దేశమని, పదేళ్లలో నాకు ఒక్క రోజు కూడా మైక్ దొరకలేదని, సీనియర్ సభ్యుడై ఉండి కూడా సభలో నాకు అవకాశమివ్వలేదని, జీరో అవర్‌లో, లేకపోతే బయట పిటిషన్లు ఇచ్చి మా దౌర్భాగ్యం చూసి నవ్వుకునే వారమన్నారు. వారు మమ్మల్ని ఎన్నో వేధింపుల పాలు చేశారని, ఇవ్వాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఏదో నీతులు చెబుతున్నారని, వారి చరిత్ర చెప్పాలంటే చాల ఉందని, నా పేరు తీసుకుని మాట్లాడినప్పుడు వారు చేసిన ప్రతి దానికి సమాధానం చెబుతున్నానన్నారు. కాగా దానం నాగేందర్‌కు మాట్లాడటానికి అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఆయన ప్రసంగం మధ్యలోనే బీఆరెస్ సభ్యులు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు.