డిప్యూటీ సీఎం భట్టితో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ

డిప్యూటీ సీఎం భట్టితో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. విలీనం, వేతన సవరణ, సంఘాల పునరుద్ధరణపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.

విధాత, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. సమావేశంలో సహచర మంత్రులు డీ.శ్రీధర్ బాబు , వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కూడా పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ,స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా , దానాకిషోర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలు కూడా సమావేశంలో ఉన్నారు.

సమావేశం ప్రారంభం కాగానే ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కు సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. 29డిమాండ్లకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. అయితే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై కార్మిక సంఘాల పట్టుబట్టాయి.ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా పెంపుపై డిమాండ్ తో పాటు సమ్మె డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణలపై ముందుగా ప్రభుత్వం ప్రకటన చేయాలని కార్మిక సంఘాల నాయకులు చర్చల్లో పట్టుబట్టారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

డిప్యూటీ సీఎం భట్టితో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ
తెలంగాణ రోడ్లకు మహర్దశ.. 98వేల కోట్లతో అభివృద్ధి పనులు.. హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌

Latest News