ఆప్ పార్టీలో తిరుగుబాటు..పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం
ఆప్ పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించగా పార్లమెంటరీ పార్టీ విలీనమైందని సంచలనం రేగింది.
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు సంచలనం రేరపింది. పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ లు బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. మా వెంట 8మంది ఎంపీలు ఉన్నారని ..రాజ్యసభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ కు అందించారు. ఆప్ పార్టీకి రాజ్యసభలో మొత్తం 10మంది ఎంపీలు ఉండగా..వారిలో ఇప్పటికే హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రం సింగ్ సాహ్నిలు పార్టీకి దూరమయ్యారు. సంజయ్ సింగ్ మినహా మిగతా సభ్యులు అంతా తమ వెంట ఉన్నట్లుగా రాఘవ్ చద్దా వెల్లడించారు. రాఘవ చద్దాకు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆప్ సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరుగనుంది.
ఈ పరిణామాలపై ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా స్పందించారు. ఆప్ పార్టీ ప్రస్తుతం అవినీతిపరుల చేతుల్లో ఉందని ఆరోపించారు. పార్టీని ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చాం అని..ప్రస్తుతం అవినీతి పరుల ఆధీనంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. నా సొంత పార్టీనే నా నోరు మూయించిందని రాఘవ్ చద్దా వాపోయారు. ఇంతకాలం నేను రాంగ్ పార్టీలో ఉన్నాననిపిస్తుంది అని, నా జీవితంలో 15 ఏళ్లు ఆప్ కోసం కేటాయించాను అని, ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చాం అని, ఆప్ ఇప్పుడు దేశం కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పని చేస్తోందని ఆరోపించారు. ఇటీవలే రాఘవ్ చద్దాను పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఆశోక్ మిట్టల్ ను నియమించారు. ఆయన కూడా చద్దాతో కలిసి బీజేపీ లో చేరడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
తెలంగాణ రోడ్లకు మహర్దశ.. 98వేల కోట్లతో అభివృద్ధి పనులు.. హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్ కారిడార్
రేపే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన..పార్టీ పేరుపై సస్పెన్స్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram