Hyderabad Water Supply | బీ అలర్ట్.. జులై 30న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు జలమండలి అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జులై 30న ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు.

పటాన్ చెరు ప్రాంతంలో మంజీరా ఫేజ్-1 కోసం చేపట్టిన పనుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పటాన్‌చెరు ఇండస్ట్రీయల్ ఏరియా, ఆర్‌సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట్, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు సమీప ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతాల ప్రజలు నీటి సరఫరా నిలిపివేతను దృష్టిలో ఉంచుకోని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జలమండలి అధికారులకు సహకరించాలని కోరారు.