Earthquake | వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
Earthquake | వికారాబాద్ జిల్లా( Vikarabad District )లో భూప్రకంపనలు( Earthquake ) చోటు చేసుకున్నాయి. దీంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. పరిగి( Parigi ) మండలంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి.

Earthquake | వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. పరిగి మండలంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్ గ్రామాల్లో మూడు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది.
భూమి స్వల్పంగా కంపించడంతో.. చాలా మంది నిద్రలో నుంచి మేల్కొని ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. కొందరైతే నిద్ర మబ్బులోనే బయటకు వచ్చి ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు.. మళ్లీ తమ నివాసాల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు.