కేసీఆర్ ప్రచారానికి ఈసీ బ్రేక్
బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. సిరిసిల్ల ప్రచారంలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ కుక్కల కొడుకులు అని చేసిన అనుచిత

సిరిసిల్ల సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు
విధాత: బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. సిరిసిల్ల ప్రచారంలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ కుక్కల కొడుకులు అని చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకున్నది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి రానున్నది. ఈసీ చర్యలపై కేసీఆర్ స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీ నిషేధం పెట్టలేదన్నారు. బీఆరెస్ కార్యకర్తలు 96 గంటల పాటు కష్టపడి పని చేయాలని సూచించారు.
ఈసీ చర్యలపై కేటీఆర్
ఇదెక్కడి అరాచకం, ఏకంగా తెలంగాణకే ఆవాజ్ కేసీఆర్ గొంతు పైన నిషేధమా అన్నారు. మోదీ విద్వేశ వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపిస్తున్నాయి. బడే భాయ్, చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర ఇది అని తెలిపారు.