తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది

హైదరాబాద్ : తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఎండల తీవ్రత, వడగాలుల దృష్ట్యా రాజకీయ పార్టీల వినతి మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పోలింగ్ సమయం పెంచినట్లు ఈసీ తెలిపింది.
ముందు నిర్ణయించిన ప్రకారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉంది. కానీ పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మరో గంట పాటు సమయాన్ని పొడిగించింది. వడగాలులను దృష్టిలో ఉంచుకుని, ఓటర్లకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.