Basharath Khan | బసరత్ ఖాన్ ఇల్లు..ఆఫీసులో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు. 33 లగ్జరీ కార్లు, దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ సీజ్ అయ్యాయి

Basharath Khan | బసరత్ ఖాన్ ఇల్లు..ఆఫీసులో ఈడీ సోదాలు

విధాత : లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు.. ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇప్పటికే ఫెమా ఉల్లంఘన కేసు నమోదు చేసిన ఈడీ హైదరాబాద్ లో బసరత్ ఖాన్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లో లగ్జరీ ఇంపోర్టెడ్ కార్ల విక్రయాల డీలర్ గా ఉన్న బసరత్ ఖాన్ విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతు చేసుకుని..పన్ను ఎగవేసినట్లుగా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.

అక్రమ మార్గంలో లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునే బసరత్ ఖాన్ వాటిని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు కార్లను విక్రయించాడు. బసరత్ ఖాన్ పై ఫెమా కేసు నమోదు చేసిన అహ్మదాబాద్ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవలే కేరళలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ అధికారులు‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ పేరుతో లగ్జరీ కార్ల స్కామ్ కేసులో చేపట్టిన దాడులలో బస్రత్ ఖాన్ విక్రయించిన 33లగ్జరీ కార్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అందులో నటుడు దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా ఉంది.