Edupayala Temple : 29 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం
మంజీరా నది వరద ఉద్ధృతి కారణంగా మెదక్ ఏడుపాయల ఆలయం వరుసగా 29 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భక్తుల సందర్శన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

విధాత : మంజీరా నది వరద ఉదృతి నేపధ్యంలో మెదక్ ఏడుపాయల ఆలయం వరుసగా గత 29రోజులుగా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. అమ్మవారి గర్భగుడి ఎదుట క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఆలయం వద్ద ఉన్న రోడ్డుపై స్వల్పంగా మంజీరా వరద ప్రవహిస్తుంది.
వరద విరామం లేకుండా 29రోజులుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు కూడా ఉత్సవ విగ్రహంతోనే కొనసాగించారు. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆలయాన్ని శుభ్రం చేసి..భక్తుల సందర్శనను పునరుద్దరించేందుకు అధికారులు ఏర్పాట్టు చేపట్టారు. త్వరలో భక్తుల సందర్శనకు అవకాశం కల్పిస్తారు.
29 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం
రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు
అమ్మవారి గర్భగుడి ఎదుట ఎదుట తగ్గిన వరద
ఆలయం వద్ద ఉన్న రోడ్డుపై స్వల్పంగా ప్రవహిస్తున్న మంజీరా#EdupayalaTemple #ManjiraRiver #Telangana pic.twitter.com/sbsmyCRNft
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 11, 2025