Edupaya Temple| ఏడుపాయల ఆలయం పైకప్పును తాకిన మంజీరా

మెద‌క్ జిల్లాలో మంజీరాన‌ది ఉగ్ర‌రూపం దాల్చింది. ఏడు పాయల వనదుర్గ ఆలయం వద్ద ఆలయం పైకప్పును తాకుతూ మంజీరా ఉదృతంగా ప్రవహిస్తుంది.

Edupaya Temple| ఏడుపాయల ఆలయం పైకప్పును తాకిన మంజీరా

విధాత : మెద‌క్(Medak)జిల్లాలో మంజీరాన‌ది(Manjeera River) ఉగ్ర‌రూపం దాల్చింది. ఏడు పాయల వనదుర్గ ఆలయం(Edupayala Temple) వద్ద ఆలయం పైకప్పును తాకుతూ మంజీరా ఉదృతంగా ప్రవహిస్తుంది. లక్షకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో ప్రసాదాల పంపిణీ షెడ్డు వరదలో కొట్టుకపోయింది. ఏడు పాయల ఆలయానికి వచ్చే రెండు మార్గాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులు ఎవరూ కూడా ఆలయం వైపు రావద్ధని అధికారులు హెచ్చరించారు. బారికేడ్లు పెట్టి భక్తులను హెచ్చరించారు.

ఇప్పటికే వరద ఉదృతి 15 రోజులుగా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి ఆలయం మూతపడింది. వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో రాజగోపురంలోనే అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజగోపురంలో లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు.