రాజకీయాల్లోకి మరో కలెక్టర్..

విధాత‌: తెలంగాణ అణువణువు అర్ధం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్..ఏదైనా ఒక ప్రోగ్రాం, ప్రాజెక్ట్ చేపట్టాలంటే వారి అపార అనుభవంతో తెలంగాణ అభివృద్ధి చేశారు.సిద్దిపేటలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేది సీఎం కేసీఆర్ విజన్ తో మేము నడుచుకున్నాం..సీఎం కేసీఆర్ ఆదేశాలు రాగానే పార్టీ లో చేరుతానని మాజీ క‌లెక్ట‌ర్ వెంకట్రామి రెడ్డి వెల్ల‌డించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేట ను అభివృద్ధి లో దేశంలో […]

రాజకీయాల్లోకి మరో కలెక్టర్..

విధాత‌: తెలంగాణ అణువణువు అర్ధం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్..ఏదైనా ఒక ప్రోగ్రాం, ప్రాజెక్ట్ చేపట్టాలంటే వారి అపార అనుభవంతో తెలంగాణ అభివృద్ధి చేశారు.సిద్దిపేటలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేది సీఎం కేసీఆర్ విజన్ తో మేము నడుచుకున్నాం..సీఎం కేసీఆర్ ఆదేశాలు రాగానే పార్టీ లో చేరుతానని మాజీ క‌లెక్ట‌ర్ వెంకట్రామి రెడ్డి వెల్ల‌డించారు.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేట ను అభివృద్ధి లో దేశంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు. ఎన్నో కొత్త ప్రాజెక్ట్ లకు సిద్దిపేట జిల్లా వేదిక అయింది. సీఎం కేసీఆర్ ఆలోచన విధానం తో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరిగుతున్న అభివృద్ధి చూసాను..తెలంగాణలో అంతకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది.

అందులో నేను బాగస్వామ్యున్ని కావడం ఆనందంగా ఉంది. భూసేకరణ విషయంలో 9వేల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసాం..ముంపు గ్రామాల వాసులు ఖాళీ చేసే సమయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చేసాం..సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ జిల్లాలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము.

నా 26 సంవత్సరాల సర్వీస్ లో ఈ 7 సంవత్సరాలు నాకు సంతృప్తి ని ఇచ్చింది. ఈ 7 సంవత్సరాలు అనేక కార్యక్రమాలలో నన్ను సీఎం కేసీఆర్ భాగస్వామ్యం చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఏ పదవి ఇచ్చిన నా వంతు కృషి చేస్తానని ఆయ‌న పేర్కొన్నారు.