Fancy number | కారు ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఏకంగా రూ.25.50 లక్షలు.. తెలంగాణలో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి..!

Fancy number | సాధారణంగా ప్రతి వాహనానికి ఒక రిజిష్ట్రేషన్‌ నెంబర్ ఉంటుంది. వాహనానికి రిజిష్ట్రేషన్‌ చేయించినప్పుడు రవాణా శాఖ అధికారులు ఆ నెంబర్‌ ఇస్తారు. కానీ కొంత మందికి రవాణా శాఖ అధికారులు ఇచ్చే ఆ సాధారణ నెంబర్‌ నచ్చదు. తమ వాహనం నెంబర్ ఫ్యాన్సీగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా సరే భరిస్తారు. లక్షలు పెట్టి మరీ ఫ్యాన్సీ నెంబర్‌లను కొనుగోలు చేస్తారు.

Fancy number | కారు ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఏకంగా రూ.25.50 లక్షలు.. తెలంగాణలో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి..!

Fancy number : సాధారణంగా ప్రతి వాహనానికి ఒక రిజిష్ట్రేషన్‌ నెంబర్ ఉంటుంది. వాహనానికి రిజిష్ట్రేషన్‌ చేయించినప్పుడు రవాణా శాఖ అధికారులు ఆ నెంబర్‌ ఇస్తారు. కానీ కొంత మందికి రవాణా శాఖ అధికారులు ఇచ్చే ఆ సాధారణ నెంబర్‌ నచ్చదు. తమ వాహనం నెంబర్ ఫ్యాన్సీగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా సరే భరిస్తారు. లక్షలు పెట్టి మరీ ఫ్యాన్సీ నెంబర్‌లను కొనుగోలు చేస్తారు.

తాజాగా తెలంగాణలో ఓ కారు ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఏకంగా రూ.25 లక్షలకుపైగా వెచ్చించారు. రాష్ట్రంలో TG అక్షరాలతో కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఓ కారు ఫ్యాన్సీ నెంబర్‌ను ఏకంగా రూ.25 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు.

ఖైరతాబాద్‌లో జరిగిన వేలంలో సోని ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూషన్స్‌ సంస్థ.. తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ వాహనం కోసం TG09 9999 నెంబర్‌ను కొనుగోలు చేసింది. దాని కోసం సోని ట్రాన్స్‌పోర్ట్ ఏకంగా రూ.25,50,002 చెల్లించినట్లు హైదరాబాద్‌ జేడీసీ సీ రమేశ్‌ తెలిపారు. ఆ ఫ్యాన్సీ నెంబర్‌తోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నెంబర్‌లను కూడా సోమవారం వేలం వేశారు.

ఈ నెంబర్‌ల వేలం ద్వారా ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహనం ఫ్యాన్సీ నెంబర్‌కు ఇంత ధర పలుకడం ఇదే తొలిసారని చెప్పారు.