Medak | మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తండ్రికొడుకుల బలి
మెదక్ జిల్లా పెద్ద శంకరం పెట్ మండలంలోని రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు

విధాత హైదరాబాద్ : మెదక్ జిల్లా పెద్ద శంకరం పెట్ మండలంలోని రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు. రామోజీపల్లి గ్రామానికి చెందిన శ్రీ రాములు(46) విశాల్(14) తండ్రి కొడుకు ఇద్దరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను అరబోయడానికి వెళ్లగా అదే సమయంలో పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు పంచనామా చేపట్టారు.