Rains | రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Rains విధాత‌: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉన్నదని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. మరోవైపు రాగల మూడు రోజులు గరిష్ఠ […]

Rains | రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Rains

విధాత‌: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉన్నదని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. మరోవైపు రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది.