Minister ponguleti|| మంత్రి పొంగులేటి కుమారుడి కంపెనీ పై కేసు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి నిర్వహిస్తున్న రాఘవా కన్ స్ట్రక్షన్ పై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బంజారాహిల్స్ బీఎన్ రెడ్డి కాలనీకి చెందిన పల్లవి ఎస్ షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. ఎఫ్ఐఆర్ లో నమోదు అయిన వివరాలు ఇలా ఉన్నాయి.
విధాత: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి నిర్వహిస్తున్న రాఘవా కన్ స్ట్రక్షన్ పై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బంజారాహిల్స్ బీఎన్ రెడ్డి కాలనీకి చెందిన పల్లవి ఎస్ షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. ఎఫ్ఐఆర్ లో నమోదు అయిన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి లో సర్వే నెంబర్ 245-19 లోని తమ భూమిలోకి న్యూ జెన్ బిల్డర్స్ యజమానులు సుధీర్ షా, అవినవ్ షా, అక్షయ్ షా, అమృత్ షా లు అక్రమంగా చొరబడ్డారని పల్లవి నవంబర్ 30వ తేదీన మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 29వ తేదీ అర్థరాత్రి సమయంలో తమ భూమిలోకి నాలుగు జేసీబీలు, 70 మంది బౌన్సర్లతో ప్రవేశించారని, చాలా మంది మాస్క్ లు వేసుకుని వచ్చారని పేర్కొంది. తమ ఉద్యోగులు అయిన శివచరణ్ తండ్రి పేరు హోరిల్ ప్రసాద్, శ్రీను తండ్రి పేరు హనుమంతు, ధారంపాల్ పై భౌతికంగా దాడి చేసి, నానా బూతులు తిట్టారు.
వారిని నిరోధించేందుకు తమ ఉద్యోగులు ప్రయత్నించినప్పటికీ విన్పించుకోకుండా గోశాలను ధ్వంసం చేవారని పేర్కొన్నారు. అక్షయ్ షా, ప్రశాంత్, అవినవ్ షా లు అక్రమంగా తమ భూమిలోకి ప్రవేశించి సెక్యురిటీ సిబ్బంది టెంట్ ను తొలగించారని, గోశాలలో ఫ్యాన్లు తీసివేసి, వారి నుంచి ఫోన్లు లక్కున్నారు. ఇది రాఘవా కన్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన స్థలం అని వచ్చినవాళ్లు తమ సిబ్బందిని బెదిరించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేని నాలుగు జేసీబీలతో వచ్చి సైట్ లో రచ్చ రచ్చ చేశారు.
టీఎస్ 22టీఏ 1011, టీఎస్ 09ఎఫ్.వీ 4594, టీఎస్ 84హెచ్.జే 1473, ఏపీ 28డీ 2927 నెంబర్ గల కార్లు, టీఎస్ 10యూఏ 0378 ట్రక్ లలో చేరుకున్నారు. పల్లవి ఎస్ షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో నవంబర్ 30న బీఎన్ఎస్ సెక్షన్ 329(3), 118(1), 324(4), 304(2), 127(2), 351(2) కింద కేసు నమోదు (ఎఫ్ఐఆర్ నెంబర్ 2789/2025 తేదీ 30-11-2025) చేసి విచారణ బాధ్యతలు ఎస్ఐ అనిల్ కుమార్ కు అప్పగించారు. మొదటి నిందితుడిగా సుధీర్ షా, రెండో నిందితుడి గా అవినవ్ షా, మూడు అక్షయ్ షా, నాలుగు అమృత్ షా, ఐదు ప్రశాంత్ తో పాటు ఇతరులుగా చేర్చారు. ఆరో నిందితుడిగా న్యూజెన్ బిల్డర్స్ కాగా ఏడవ నిందితుడిగా రాఘవా కన్ స్ట్రక్షన్ బిల్డర్స్ గా నమోదు అయ్యింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram