Hyderabad | హైద‌రాబాద్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Hyderabad | హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు.

Hyderabad | హైద‌రాబాద్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Hyderabad | హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మృతుల‌ను ల‌క్ష్మ‌య్య‌(60), భార్య వెంక‌ట‌మ్మ‌(55), కుమార్తె క‌విత‌(24), అల్లుడు అనిల్(32), ఈ దంప‌తుల కుమార్తె అప్పు(2) గా గుర్తించారు. మృతులంతా క‌ర్ణాట‌లోకి గుల్బార్గా ప్రాంతానికి చెందిన వార‌ని పోలీసులు నిర్ధారించారు. రెండేళ్ల కుమార్తెను చంపేసిన అనంత‌రం న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స్థానికంగా ఐదుగురి మృతి చెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.