Himayat Sagar | నిండు కుండ‌లా జంట జ‌లాశ‌యాలు..! గేట్ల ఎత్తివేత‌కు రంగం సిద్ధం..!!

Himayat Sagar | హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర శివార్ల‌లో ఉన్న జంట జ‌లాశ‌యాలు హిమాయ‌త్ సాగ‌ర్(Himayat Sagar ), ఉస్మాన్ సాగ‌ర్( Osman Sagar ) నిండు కుండ‌లా మారాయి. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు( Heavy Rains ) ఈ రెండు జ‌లాశ‌యాల‌కు వ‌ర‌ద పోటెత్తింది.

  • By: raj |    telangana |    Published on : Aug 07, 2025 8:37 AM IST
Himayat Sagar | నిండు కుండ‌లా జంట జ‌లాశ‌యాలు..! గేట్ల ఎత్తివేత‌కు రంగం సిద్ధం..!!

Himayat Sagar | హైద‌రాబాద్ : హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర శివార్ల‌లో ఉన్న జంట జ‌లాశ‌యాలు హిమాయ‌త్ సాగ‌ర్(Himayat Sagar ), ఉస్మాన్ సాగ‌ర్( Osman Sagar ) నిండు కుండ‌లా మారాయి. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు( Heavy Rains ) ఈ రెండు జ‌లాశ‌యాల‌కు వ‌ర‌ద పోటెత్తింది. ఈ జంట జ‌లాశ‌యాలు పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరుకోవ‌డంతో.. గేట్లు ఎత్తేందుకు జ‌ల‌మండ‌లి( Jala mandali ) అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం నాటికి ఏ క్ష‌ణంలోనైనా గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండ‌లి అధికారులు దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. రెవెన్యూ, పోలీసు, ఇత‌ర ప్ర‌భుత్వ సంస్థ‌ల అధికారుల‌ను జ‌ల‌మండ‌లి యంత్రాంగం అల‌ర్ట్ చేశారు. దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు.

ఉస్మాన్ సాగ‌ర్( Osman Sagar ) ఫుల్ ట్యాంక్ లెవ‌ల్ 1,790 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1,782 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగ‌ర్‌కు ఇన్‌ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది, హిమాయ‌త్ సాగ‌ర్( Himayat Sagar ) పూర్తి నీటిమ‌ట్టం 1,764 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1,763 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1600 క్యూసెక్కులుగా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.