Srisailam | కృష్ణమ్మ పరుగులు.. శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ..
Srisailam | నైరుతి రుతుపవనాల( Monsoon ) రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు( Rains ) కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా నది( Krishna River ) పరుగులు పెడుతోంది.

Srisailam | హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల( Monsoon ) రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు( Rains ) కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా నది( Krishna River ) పరుగులు పెడుతోంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు( Jurala Project )కు వరద పోటెత్తింది. వరద ప్రవాహం మొదలైన 8 గంటల్లోనే నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాత్రి 7 గంటలకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో.. శ్రీశైలం జలాశయానికి( Srisailam Project ) వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. జూరాల నుంచి 88,835 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 8,824 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా నమోదైంది.