సీఎం రాకతో ఒరిగిందేమీ లేదు: బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యేలు

సీఎం పర్యటన వల్ల వరంగల్ కి ఒరిగింది ఏమీ లేదని బీఆరెస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు

  • Publish Date - June 30, 2024 / 01:54 PM IST

పేదల వైద్యం పై సీం కు శ్రద్ధలేదు
ఏడునెలలైనా రూపాయి రాలేదు
మంత్రులు సురేఖ, సీతక్క డమ్మీలు
బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, పెద్ది విమర్శ

విధాత, వరంగల్ ప్రతినిధి: సీఎం పర్యటన వల్ల వరంగల్ కి ఒరిగింది ఏమీ లేదని బీఆరెస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దల వైద్యం మీద ఉన్న శ్రద్ధ పేదల వైద్యం మీద లేదని ఈ చరిత్రాత్మక వరంగల్ నగరానికి కేవలం ఒక ప్రయివేటు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సీఎం వచ్చారన్నారు. ఎంజీఎంలో అడుగు పెట్టలేదు.. కానీ ప్రయివేటు హాస్పిటల్ ఓపెనింగ్ కి మాత్రం వెళ్లారని విమర్శించారు.

బీఆరెస్‌ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం పర్యటన నేపథ్యంలో మాట్లాడారు.

కెసిఆర్ దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును జిల్లాలో ఏర్పాటు చేశారన్నారు. సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ని నిన్న సీఎం చూసి అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించడం లాంటి పనులు చేశారని ఆరోపించారు. నగరం వరదతో అతలాకుతలం అయితే రూ. 25 కోట్లు ఇచ్చారనీ, సమ్మయ్య నగర్, టీవీ టవర్ లాంటి పలు కాలనీలు వరదల్లో మునుగుతుంటే రూ. 75 కోట్లు నిధులు కేటాయించి, ముంపు సమస్యను పరిష్కారించారని గుర్తుచేశారు. 6వేల కోట్లు నగరాభివృద్ధికి కావాలని నిన్న ఎమ్మెల్యేలు , మంత్రులు ముఖ్యమంత్రి కి చెప్పారన్నారు. గెలిచి 7 నెలలు అయినా ఒక్క రూపాయి నగరానికి తీసుకురాలేదని వినయ్ నేను బహిరంగంగా సవాలు చేశారు.

సీఎంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదు: పెద్ది

సీఎం పనితీరు పట్ల వాళ్ళ ఎమ్మెల్యే లకే విశ్వాసం తగ్గిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం 26 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నారని ఆరోపించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి మాటలనే అధికారిక మాటలుగా తీసుకోవాలంటే సురేఖ, సీతక్క లమాటలకు విలువలేదని ఎద్దేవా చేశారు.

సాగునీటి ప్రాజెక్టులపై చర్చ, జిల్లాపై సమగ్ర రివ్యూ మీటింగ్స్ ఇప్పటికీ జరగలేదన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే లు గాలికి తిరుగుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మా రెడ్డి మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కుకు కేంద్రం రూ.500 కోట్లు పీఎం మిత్ర ఫథకం క్రింద ఇస్తాము అన్నారు.. అట్టి డబ్బుల విడుదలకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బైరబోయిన ప్రశాంత్ , మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Latest News