ఏడీబీతో విచారణ జరిపించాలి: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆకునూరి మురళీ ట్వీట్‌

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరు..నిర్వాహణ భారం..ప్రాజెక్టు మనుగడలపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ ఆసక్తికర ట్వీట్ చేశారు

ఏడీబీతో విచారణ జరిపించాలి: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆకునూరి మురళీ ట్వీట్‌

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరు..నిర్వాహణ భారం..ప్రాజెక్టు మనుగడలపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిపుణులతో కూడిన అసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు బృంంతో విచారణ జరిపించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని మురళీ తన ట్వీట్లో పేర్కోన్నారు.

సిట్టింగ్ జడ్జి తో పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయి నీటి పారుదల రంగాల నిపుణులతో, అంతర్జాతీయ ఆర్ధిక, సామజిక నిపుణులతో ఒక టెక్నికల్ కమిటీ ని వేసి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు పారాయి, ఎంత కరెంటు బిల్ కట్టారు, మేడిగడ్డ కుంగడానికి కారణాలు/ఎవరు బాధ్యులు ఎవరన్నదానిపై విచారణ జరిపించాలని కోరారు.

అలాగే అసలు ఈ ప్రాజెక్ట్ వలన ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా? ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? ముందు ముందు పెట్టె పెట్టుబడి పెట్టాలా లేక ప్రాజెక్ట్ ఇక్కడి తోటే మూసేయాలా ? అనే విషయాలు తేల్చాలని, ఇందుకోసం మౌలిక సదుపాయాల నిపుణులు ఉన్న అసియన్ డెవలప్ మెంట్ బ్యాంకును విజ్ఞప్తి చేసి ఆయా అంశాలపై విచారణ జరిపించి రిపోర్టు తీసుకున్నాక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాని ట్వీట్టర్ ఎక్స్ వేదికగా సూచించారు.