Telangana: మంత్రి కోమటిరెడ్డికి విద్యాకమిషన్ నివేదిక

  • By: sr    latest    Mar 07, 2025 3:48 PM IST
Telangana: మంత్రి కోమటిరెడ్డికి విద్యాకమిషన్ నివేదిక

Telangana:

విధాత: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రూపొందించిన నివేదికను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి అందించారు. నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పైన వారు అధ్యయనం చేసిన పలు విషయాలను ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డికి వివరించారు.

ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సభ్యులు మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల నిర్వహణ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ సభ్యలు పీఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డిలు ఉన్నారు.