కాంగ్రెస్‌లోకి ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు

విధాత : అదిలాబాద్ జిల్లా ముధోల్ మాజీ ఎమ్మెల్యే, బీఆరెస్ నేత నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రేతో భేటీయైన నారాయణరావు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంకగాంధీ పర్యటన సందర్భంగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నారాయణ్‌రావు కాంగ్రెస్ నుంచి ముధోల్ టికెట్ ఆశిస్తున్నారు.