Gone Prakash Rao | రాజ్యాంగం మేరకు శాసన మండలి చెల్లుబాటు కాదు: గోనె ప్రకాశ్ రావు
రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసనమండలి చెల్లుబాటు కాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు
దీనిపై గవర్నర్‌ను, హైకోర్టును ఆశ్రయిస్తాం
విధాత, హైదరాబాద్ : రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసనమండలి చెల్లుబాటు కాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప మండలి ఏర్పాటు చేయడం కుదరదని, కానీ ప్రస్తుతం ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అని అన్నారు. ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్ సభ్యుడు లేరని గుర్తు చేశారు. శాసన మండలి మనుగడను ప్రశ్నిస్తూ గవర్నరు ఫిర్యాదు చేస్తానని, కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు.
గతంలో దశలవారీగా ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రతిపక్షాలను చీల్చిన చరిత్ర కేసీఆర్‌దేనని ధ్వజమెత్తారు. అసలు బీఆరెస్ పుట్టుకే పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలైందన్నారు. పార్టీ ఫిరాయింపులపై 2014-18 వరకు, 2018-2023 వరకు శాసనసభ స్పీకర్లుగా పని చేసిన మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి అనైతికంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సాగుతున్న చేరికలు పార్టీకి ఆప్రతిష్ఠ తెస్తాయన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అప్పుడు పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. 2/3 వంతు ఉంటే తప్ప విలీనం సాధ్యం కాదన్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram