బలగం మొగిలయ్య చికిత్సకు ప్రభుత్వ సహాయం

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బలగం మొగిలయ్యను గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అదేశాల మేరకు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి వెంకటరమణ పరామర్శించారు

  • Publish Date - June 6, 2024 / 03:14 PM IST

మంత్రి ఆదేశాలతో కదిలిన వైద్యాధికారులు

విధాత: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బలగం మొగిలయ్యను గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అదేశాల మేరకు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి వెంకటరమణ పరామర్శించారు. సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా బలగం మొగిలయ్యను పరామర్శించాక… ఆసుపత్రి వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితి పై వెంకటరమణ చర్చించారు.

మొగిలయ్యకు మెరుగైన వైద్య చికిత్స ను అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. ప్రభుత్వం తరుపున మొగులయ్యకు అవసరమైన వైద్య సాయాన్ని అందిస్తామని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. బలగం సినిమా క్లైమాక్స్‌లో కుటుంబ అనుబంధాల నేపథ్యంలో బుడిగ జంగాల దంపతులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు తమ పాటతో ప్రేక్షకులను కంట తడిపెట్టించారు. ఇప్పుడు మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రి పాలవ్వడం పట్ల ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest News