Alai Balai | సీఎం రేవంత్‌రెడ్డిని అలయ్ బలయ్‌కి ఆహ్వానించిన గవర్నర్ దత్తాత్రేయ

హైదరాబాద్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆహ్వానించారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంళవారం బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి సహా పలువురు కలిశారు.

Alai Balai | సీఎం రేవంత్‌రెడ్డిని అలయ్ బలయ్‌కి ఆహ్వానించిన గవర్నర్ దత్తాత్రేయ

విధాత, హైదరాబాద్‌ : హైదరాబాద్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆహ్వానించారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంళవారం బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి సహా పలువురు కలిశారు. దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దసరా పండుగ సందర్భంగా జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వన పత్రికను అందజేశారు. అనంతరం తన నివాసానికి వచ్చిన గవర్నర్ దత్తాత్రేయను, ఆయన కుతూరుని సీఎం రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించారు.