Governor Radhakrishnan|అవినీతి రహిత పాలనకు ప్రతిజ్ఞ తీసుకోండి రాష్ట్ర అవతరణ వేడుకల్లో.. గవర్నర్ రాధాక్రిష్ణన్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేళ ప్రజలు, పాలకులు తెలంగాణ, భారత మాత సమగ్రాభివృద్ధి కోసం మేం లంచాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ పిలుపునిచ్చారు

  • By: Subbu |    telangana |    Published on : Jun 02, 2024 4:26 PM IST
Governor Radhakrishnan|అవినీతి రహిత పాలనకు ప్రతిజ్ఞ తీసుకోండి రాష్ట్ర అవతరణ వేడుకల్లో.. గవర్నర్ రాధాక్రిష్ణన్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేళ ప్రజలు, పాలకులు తెలంగాణ, భారత మాత సమగ్రాభివృద్ధి కోసం మేం లంచాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ రోజు మనం మన గొప్ప రాష్ట్రమైన తెలంగాణా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామమన్నారు. ఈ రోజు మనమందరం లంచాలకు దూరంగా ఉండాలని, పరిపాలనను అత్యంత పారదర్శకంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.