Telangana | విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో పాఠశాలల పని వేళల్లో స్వల్ప మార్పులు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల పని వేళల్లో స్వల్పమార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల పని వేళల్లో స్వల్పమార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి. ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పని చేస్తున్నాయి.
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల నిర్వహణ కొనసాగనుంది. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పైన పేర్కొన్న సమయానికి పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.