తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధానిల శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధానిలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధానిలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఎక్స్(ట్విటర్) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram