Vijayawada-Hyderabad Highway : విజయవాడ టూ హైదరాబాద్ హైవేపై మాస్ ట్రాఫిక్
హైదరాబాద్ హైవేపై వాహనాల క్యూ! సంక్రాంతి ముగియడంతో నగరానికి పయనమైన జనం. పంతంగి, కొర్లపహాడ్ టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. పోలీసుల భారీ దారి మళ్లింపులు.
విధాత: విజయవాడ టూ హైదరాబాద్ నేషనల్ హైవే వాహనాల బారులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండగ ముగించుకుని తిరుగు పయనమైన ప్రజల వాహనాల రద్దీతో హైవేపై కొర్లపహాడ్ , పంతంగి టోల్ గేట్లు కిక్కిరిసిపోయాయి. కొర్ల పహాడ్ టోల్గేట్ వద్ద 12 గేట్లకు గాను హైదరాబాద్ వైపు ఎనిమిది గేట్లను తెరిచారు.
అటు నార్కెట్ పల్లి అద్దంకి రహదారి మార్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మాడ్గులపల్లి టోల్ గేట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రేపు అమావాస్య కావడం.. వర్ష సూచనలు ఉండడంతో సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్ళిన ప్రజలు ఒకరోజు ముందుగానే తిరిగి నగరానికి చేరుకుంటున్నారు.
రద్దీ నేపద్యంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
వాహనాల రద్దీ నివారణకై పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. గుంటూరు నుంచి హైద్రాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, కొండమల్లేపల్లి మీదుగా దారి మళ్లింపు చేస్తున్నారు.
నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను మునుగోడు, నారాయణ పూర్ మీదుగా మళ్ళింపు చేశారు.
విజయవాడ నుంచి హైద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ వయా హుజూర్ నగర్, మిర్యాలగూడ, చింతపల్లి, మాల్ మీదుగా దారి మళ్ళింపు చేస్తున్నారు.
చిట్యాల (మం) పెద్దకాపర్తి వద్ద ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న నేపధ్యంలో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ చిక్కులు అధికమయ్యాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతంలో వాహనాల రద్దీతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
దీంతో చిట్యాల వద్ద వాహనాలను రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా దారి మళ్లించారు.
సంక్రాంతి పండక్కి ఈసారి రికార్డు స్థాయిలో ఏపీకి వెళ్లారు. కోడి పందాలు చూసేందుకు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఏపీకి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Medaram : శ్రీ సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
Virat Ramayan Mandir : వైభవంగా బీహార్ లో ప్రపంచ భారీ మహాశివలింగం ప్రతిష్టాపనోత్సవం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram