హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. సెల్‌ఫోన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో కాల్పులు
హైదరాబాద్ నగరంలో పోలీసు కాల్పులు కలకలం రేపాయి. సికింద్రాబాద్ చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సెల్ ఫోన్ చోరిలకు పాల్పడుతున్న క్రమంలో చూసిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పోలీసు కాల్పులు కలకలం రేపాయి. సికింద్రాబాద్ చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సెల్ ఫోన్ చోరిలకు పాల్పడుతున్న క్రమంలో చూసిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను గమనించిన దొంగల ముఠా వారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పారిపోతున్న వారిపై పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకితో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో దొంగల ముఠా భయంతో నిలిచిపోగా పోలీసులు ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు కాల్పుల ఘటనతో స్థానిక ప్రజలు ఏం జరుగుతుందన్న ఆందోళనకు గురయ్యారు. పోలీసు కాల్పులు మిస్ ఫైర్ కాకుండా.. ఎవరు గాయపడుకుండా దొంగలు పట్టుబడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.