గురుకుల కళాశాలలో రక్తపింజర పాము…తప్పిన ముప్పు

విధాత : గురుకులాలు అంటేనే విద్యార్థుల్లో..తండ్రులలో ఇప్పటికే ఓ రకమైన దురాభిప్రాయం నెలకొంది. నాసికరమైన భోజనం..అరకొర మౌలిక వసతులు..సిబ్బంది వేధింపులు వంటి అనేక సమస్యలు తరుచు వెలుగుచూస్తున్నాయి. పాములు, తేళ్ల సంగతి చెప్పనవసరం లేదు. గురుకులాల్లో చదువుతున్న పలువురు విద్యార్థిని, విద్యార్ధులు ఈ ఏడాది పలు కారణాలతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ సమస్యల నేపథ్యంలో తాజాగా ఓ గురుకులంలోని విద్యార్ధుల బాత్ రూమ్ లోకి పాము చొరబడటం కలకలం రేపింది.
నాగర్‌కర్నూల్‌లోని జ్యోతిరావు పూలే బాలుర కళాశాల బాత్రూంలోకి అత్యంత విషపూరితమైన పాము రక్తపింజర రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటను కళాళాల అధ్యాపకులకు సమాచారం ఇవ్వడంతో వారు స్నేక్ క్యాచర్ ను రప్పించి పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ కళాశాలలో కనీస వసతులు లేవని ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి సారించాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
గురుకుల కళాశాలలో రక్తపింజర పాము కలకలం
నాగర్‌కర్నూల్‌లోని జ్యోతిరావు పూలే బాలుర కళాశాల బాత్రూంలోకి రక్తపింజర పాము రావడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు pic.twitter.com/8rEpgJEhCy
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2025