అద్భుత నిర్మాణ శైలీలో హరే కృష్ణ హెరిటేజ్ ఆలయం
120 మీటర్ల గోపురంతో ఆలయ నిర్మాణం
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నార్సంగి గోష్పాద క్షేత్రంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన హరే కృష్ణ హెరిటేజ్ టవర్ నూతన నమూనా చిత్రాన్ని ఆవిష్కరించారు. 120 మీటర్ల గోపుర నిర్మాణంతో నిర్మించనున్న ఈ ఆలయం కోకాపేట్ స్కైలైన్‌లో ఒక ఐకానిక్ భాగం అవుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మహా ద్వారంలో కాకతీయ కళా తోరణం అంశాలు ఉంటాయిని, నిర్మాణ పనులకు గత ఏడాది మే 8న భూమి పూజ చేయగా, 200కోట్లతో చేపట్టనున్న ఈ ఆలయం పనులు 2028నాటికి పూర్తికానున్నాయి.
శ్రీ రాధా, కృష్ణ దేవతలతో పాటు అష్టసఖిలుగా పిలువబడే ఎనిమిది మంది గోపికలు, గొప్ప ఆలయ హాలులో ప్రతిష్టించనున్నారు. తిరుమలలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం స్ఫూర్తితో శ్రీ శ్రీనివాస గోవిందానికి అంకితం చేయబడిన పెద్ద ప్రాకారంతో సాంప్రదాయ రాతితో చెక్కబడిన ఆలయం ఉంటుందని, ఈ టవర్ కాకతీయ, చాళుక్య, ద్రావిడ,ఇతర పురాతన శైలుల నుండి నిర్మాణ శైలులను తీసుకుని ఆలయం నిర్మించబోతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram