TELANGANA | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు .. హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన

తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఆవర్తనం గంగా పశ్చిమ బెంగాల్‌ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణశాఖ పేర్కొంది

TELANGANA | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు .. హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఆవర్తనం గంగా పశ్చిమ బెంగాల్‌ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణశాఖ పేర్కొంది. ఆదివారం రాత్రి సోమవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఛాన్స్‌ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. అదే సమయంలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది.

కాగా ఆదివారం రాత్రి హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.