Rains | రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

Rains | రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

Rains | రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

Rains : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడెక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాబట్టి ఈ నాలుగు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా రేపే పోలింగ్‌ నిర్వహించనున్నారు. అయితే తెలంగాణకు వర్ష సూచన నేపథ్యంలో పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో కూడా వర్షాలు పడ్డాయి.