CM ON SPORTS UNIVERSITY | స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM REVANT REDDY) క్లారిటీ ఇచ్చారు. 26-08-2024 సోమవారం నాడు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒలింపిక్స్

నైపుణ్యం లేక నిరుద్యోగం
రాష్ట్రంలో సర్టిఫికెట్ కోర్సులకే పరిమితమవుతున్న విద్య
స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ఇండస్ట్రీ డ్రివెన్ విధానం తెచ్చాం
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM ON SPORTS UNIVERSITY : రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM REVANT REDDY) క్లారిటీ ఇచ్చారు. 26-08-2024 సోమవారం నాడు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒలింపిక్స్ (OLAMPICS) లో మన దేశం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదని, అందుకే వచ్చే అకడమిక్ ఇయర్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University )ని ప్రారంభించుకోబోతున్నామని సీఎం సభ సాక్షిగా వెల్లడించారు. భవిష్యత్ లో క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
నైపుణ్యం లేకే…
నైపుణ్యం లేకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని(unemployment problem is increasing due to lack of skills) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్య సర్టిఫికెట్ కోర్సులకే పరిమితమవుతోంద(He said that education in the state is limited to certificate courses ) అన్నారు. చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతునందని తెలిపారు. యువతకు తగిన శిక్షణ ఇవ్వడం కోసమే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామన్నారు. కొంతమంది విజ్ఞుల సూచనతో యూనివర్సిటీ నిర్వహణకు ఇండస్ట్రీ డ్రివెన్ విధానం(industry driven approach) తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా(Anand Mahindra )ను నియమించామన్నారు. స్కిల్ యూనివర్సిటీ వచ్చే ఏడాది నుంచి 20వేల మందికి శిక్షణ అందిస్తుందన్నారు.
గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు
వసతి గృహాల్లో సరైన మౌలిక వసతులు ఉండటం లేదన్న రేవంత్ రెడ్డి అన్ని రకాల మౌలిక వసతులతో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు(All Gurukuls under one umbrella) తీసుకొస్తున్నామని ప్రకటించారు. జాతీయ స్థాయి ప్రమాణాలు, వసతుల(national standards and facilities) తో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రేసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
10, 15 రోజుల్లోగా అన్ని యూనివర్సిటీలకు వీసీలు
పది, పదిహేను రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామని(VCs to all universities within 10,15 days) సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని, గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్లు లబ్ది పొందారని తెలిపారు. వాళ్ల కు ఉద్యోగాలు పోతే తప్ప వారికి విద్యార్థులు, నోరుద్యోగులు గుర్తురాలేదన్నారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరసనలు, ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదని, కొంతమంది కుట్రలకు మీరు పావులుగా మారకండని హితవు పలికారు. ప్రభుత్వ నిర్ణయాలపై మీరు సొంతంగా ఆలోచన చేయాలని కోరారు. మా ప్రభుత్వ ప్రాధాన్యత విద్య, ఉద్యోగకల్పన, రైతు సంక్షేమం అని తెలిపారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి… మీ అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత నాదన్నారు.
మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించండి.. లక్ష సాయం చేస్తాం (Pass the mains we will help you lakh)
ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన వారికే కాదు… మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారికీ రూ.1లక్ష సాయం అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రిలిమ్స్ లోనే కాదు.. మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా నిలబడుతుందన్నారు. మీరు పరీక్షలపైనే దృష్టి పెట్టండి… మీ కుటుంబానికి, రాష్ట్రానికి గౌరవం పెంచండి అని సివిల్స్ అభ్యర్థులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణ నుంచి అత్యధికంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని, అందుకోసమే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం చేపట్టామన్నారు. ఆర్ధిక సాయం కంటే మీరు మా కుటుంబ సభ్యులు అనే విశ్వాసం కల్పించేందుకే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. సచివాలయం(secretariat) తెలంగాణ(Telangana) ప్రజలదని నమ్మకం కలిగించేందుకే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశామని రేవంత్ తెలిపారు.
మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు
నిరుద్యోగులు, విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా అధికారంలోకి రాగానే దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగ (30 thousand jobs in three months) నియామకాలు చేపట్టామన్నారు. మరో 35వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్దిని నిరూపించుకుంటున్నాని చెప్పారు.