HMWSSB | బీ అల‌ర్ట్.. హైద‌రాబాద్‌లో నేడు 16 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

HMWSSB | న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో బుధ‌వారం( Wednesday ) నీటి స‌ర‌ఫ‌రా( Water Supply ) నిలిచిపోనుంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు మంచి నీటి స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు హైద‌రాబాద్ జ‌ల మండ‌లి( Jala Mandali ) ప్ర‌క‌టించింది.

HMWSSB | బీ అల‌ర్ట్.. హైద‌రాబాద్‌లో నేడు 16 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

HMWSSB | హైద‌రాబాద్ : తాగునీటి స‌ర‌ఫ‌రా( Water Supply ) విష‌యంలో హైద‌రాబాద్( Hyderabad ) జ‌ల మండ‌లి( Jala Mandali ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆగ‌స్టు 6వ తేదీన అంటే బుధ‌వారం( Wednesday ) ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నీటి స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. లింగంపల్లి( Lingampally ) నుంచి సనత్‌నగర్ రిజర్వాయర్‌( Sanathnagar Reservoir )కు నీటిని సరఫరా చేసే రెండు ప్రధాన పైపు లైన్ల వద్ద ప్రతిపాదించబడిన జంక్షన్ పనుల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింద‌ని పేర్కొన్నారు.

బుధవారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనులు జరుగుతాయని, దీని ఫలితంగా అనేక ప్రాంతాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్ప‌ష్టం చేశారు. కొన్ని చోట్ల తక్కువ ప్రెజ‌ర్‌తో నీటిని సరఫరా చేస్తామని జలమండలి అధికారులు పేర్కొన్నారు.

నీటి స‌ర‌ఫ‌రా బంద్ అయ్యే ప్రాంతాలు ఇవే..

రాజీవ్ గాంధీ న‌గ‌ర్, ఎన్టీఆర్ న‌గ‌ర్, శ్రీశ్రీ న‌గ‌ర్, ప్రశాంత్ న‌గ‌ర్, దీన్‌ద‌యాళ్ న‌గ‌ర్, జింక‌ల‌వాడ‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి న‌గ‌ర్, స‌మ‌తాన‌గ‌ర్, వెంక‌టేశ్వ‌ర న‌గ‌ర్, కార్మిక్ న‌గ‌ర్, శివ‌శంక‌ర్ న‌గ‌ర్, ఎల్బీఎస్ న‌గ‌ర్, ఫ‌తే న‌గ‌ర్, చ‌ర‌బండ రాజు కాల‌నీ, బాలాన‌గ‌ర్, జ‌న‌తా న‌గ‌ర్, చైత‌న్య బ‌స్తీ, వ‌డ్డ‌ర్ బ‌స్తీ, ఎరుక‌ల బ‌స్తీ, శాస్త్రి మార్గ్, జిల్లా బ‌స్తీ, శ్రీరాం కాల‌నీ, కైత్లాపూర్, రాఘ‌వేంద్ర కాల‌నీ, హ‌నుమాన్ చౌక్, యాద‌వ్ బ‌స్తీ, హెచ్‌పీ రోడ్, భ‌వానీ న‌గ‌ర్, స‌ర్దార్ ప‌టేల్ న‌గ‌ర్, గూడ్స్ షెడ్ రోడ్, జేపీ న‌గ‌ర్, ఈడ‌బ్ల్యూఎస్, ఎంఐజీహెచ్, హెచ్ఐజీ, ఎల్ఐజీ, స‌త్య‌సాయి న‌గ‌ర్.