Beer Shortage In Hyderabad | బీర్ల ఎద్దడితో నగరవాసులు విలవిల..ఎక్కడికిపోయినా నో స్టాక్ బోర్డ్స్!
హైదరాబాద్ నగరంలో బీర్లు దొరకడంలేదు. అసలే ఉక్కపోతకు గురవుతున్న నగరవాసులపై ఇదో పిడుగుపాటుగా మారింది.
హైదరాబాద్ నగరంలో బీర్లకు కొరత ఏర్పడింది. ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నీటి కొరత బీర్ల తయారీని కూడా దెబ్బ కొట్టింది. దాంతో బ్రూవరీలు బీర్ తయారీని కూడా తగ్గించేసారు. మామూలుగా తెలంగాణలో సగటున నెలకు 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతుంటాయి. అందునా వేసవిలోనే ఎక్కువ శాతం తాగేస్తుంటారు. ముఖ్యంగా ఐటీ రంగంలో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్‌లో సహజంగానే బీర్ల అమ్మకాలు ఎక్కువగా నమోదవుతుంటాయి.

ప్రతీరోజూ వందకు పైగా బీర్ల కేసులు ఒక్కో షాపుకు డెలివరీ అవుతుంటాయి. అలాంటిది ప్రస్తుతం 12 కేసులే ఇస్తున్నట్లు వైన్‌షాపు యజమానులు వాపోతున్నారు. డిమాండ్ తట్టుకోలేక, బీర్లు లేవు అనే బోర్డులు కూడా తగిలిస్తున్నట్లు వారు తెలిపారు. ఇక మరికొంతమంది పక్క రాష్ట్రాల నుండి దొంగతనంగా విచిత్రమైన బ్రాండ్ల బీర్లను తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో బీరుప్రియులు అదెంత భయంకరంగా ఉన్నా, తాగక తప్పడం లేదంటున్నారు. మొత్తానికి ఈ ఎండాకాలంలో హైదరాబాద్ బీరు ప్రియుల బాధలు వర్ణనాతీతం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram