Rains | చల్లని కబురు.. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు..!
Rains | హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.

Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హైదరాబాదీలకు చల్లని కబురు అందించింది. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
గురువారం సాయంత్రం 4 గంటల వరకు నగర వ్యాప్తంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. హిమాయత్‌నగర్, గోల్కొండ, ఆసిఫ్ నగర్, సైదాబాద్, ముషీరాబాద్, బండ్లగూడ, మారేడ్‌పల్లి, చార్మినార్ ఏరియాల్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.