Hyderabad Metro | మెట్రో రైలు ప్రయాణ సమయాల్లో మార్పు లేదు

మెట్రో రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మెట్రో రైల్‌ అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు

Hyderabad Metro | మెట్రో రైలు ప్రయాణ సమయాల్లో మార్పు లేదు

విధాత: మెట్రో రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మెట్రో రైల్‌ అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.

ప్రతి శుక్రవారం రాత్రి 11. 45 గంటల వరకు, ప్రతి సోమవారం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని, వాటిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ప్రయాణికులెవరూ మెట్రో రైలు సమయాల్లో అయోమయానికి గురి కావొద్దని, యథావిధిగానే నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని అధికారులు తెలిపారు.