Ponnam Prabhakar : దేశంలోనే తొలిసారిగా మెట్రో స్టేషన్ లో పాస్ పోర్ట్ కేంద్రం

దేశంలోనే తొలిసారి హైదరాబాద్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో ఆధునిక పాస్ పోర్ట్ కేంద్రం ప్రారంభం, రోజుకు వేల స్లాట్లతో సేవలు అందుబాటులోకి.

Ponnam Prabhakar : దేశంలోనే తొలిసారిగా మెట్రో స్టేషన్ లో పాస్ పోర్ట్ కేంద్రం

విధాత, హైదారబాద్ : దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో ఆధునీకరించిన నూతన పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎంపీలుఅనిల్ కుమార్ యాదవ్, అసుద్దీన్ ఒవైసి,ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫండీ , పాస్ పోర్ట్ జాయింట్ సెక్రటరీ కేజే శ్రీనివాస్ ,హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, రీజనల్ పాస్ పోర్ట్ అధికారి స్నేహజలతో కలిసి పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటిదాక అమీర్ పేట్ ఆధిత్య ట్రేడ్ సెంటర్ లో సేవలందించిన పాస్ పోర్ట్ కేంద్రాన్ని తాజాగా ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ కు తరలించి ఆధునీకరించి అందుబాటులోకి తేవడం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. అలాగే టొలి చౌకీ షేక్ పేట్ నాలా ఆనంద్ సిలీకాన్ చీఫ్ వద్ధ ఉన్న కేంద్రాన్ని రాయదుర్గం పాత ముంబై రోడ్డు సిరి బిల్డింగ్ లోకి మార్చినట్లుగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయం దేశంలోనే 5 వ స్థానంలో ఉందని..రాష్ట్రంలో 5 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని…బేగంపేట ప్రధాన పాస్ పోర్ట్ కేంద్రంగా ఉందని తెలిపారు. ఎంజీబీఎస్ , టొలిచౌకీ , నిజామాబాద్ , కరీంనగర్ లలో పాస్ పోర్ట్ కేంద్రాలు ఉన్నాయని పొన్నం గుర్తు చేశారు. తెలంగాణలో రోజుకు 4500 పాస్ పోర్ట్ లు ఇచ్చే సామర్యం ఉందని తెలిపారు.

5వేల స్లాట్లకు పెంచుకోవాలి

ఎంజీబీఎష్ కేంద్రంలో 750 స్లాట్స్ ఉన్నాయని..దీనికి 1200 స్లాట్స్ చేసుకోవాలని..నేను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ లో ప్రారంభించుకున్న పాస్ పోర్ట్ కేంద్రంలో 250 ఉన్నాయని.. దీనిని 500 కి పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని..మొత్తం 5000 స్లాట్స్ దాటేల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరు పాస్ పోర్ట్ తీసుకోవాలని..గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికుల మాదిరి విదేశాలకు వెళ్లేది… ఇప్పుడు విద్యా, ఉపాధి అవకాశాలు నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారన్నారు. అలాగే టూరిజం కోసం విదేశాలకు వెళ్తున్నారు.. భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి పాస్ పోర్ట్ అందరు తీసుకోవాలన్నారు.

ఎంజీబీఎస్ లో పాస్ పోర్ట్ కేంద్రం అందరికీ ఉపయోగపడుతుంది.. ఇక్కడ బస్ స్టేషన్ ద్వారా వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి పాస్ పోర్ట్ తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది.. ఇక్కడ మెట్రో బస్ సౌకర్యం ఉండడం వల్ల ఎక్కువ స్లాట్స్ బుక్ అయ్యే అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. పాస్ పోర్ట్ కోసం వచ్చే వారిపట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. రాష్ట్రంలో ఎంజీబీఎస్ లోనే పాస్ పోర్ట్ తీసుకుంటాం అనే విధంగా వ్యవహరించాలి అని..పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో పోలీస్ ల జాప్యం ఉండదు..మనం అప్లై చేసుకోగానే వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసుకొని పాస్ పోర్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు.

hyderabad-mgbs-metro-station-passport-office-inaugurated-in-hyderabad