Hyderabad step wells । పూర్వ వైభవం పొందనున్న హైదరాబాద్‌ మెట్లబావులు

హైదరాబాద్‌లోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి, పర్యాటక ప్రాంతాలుగా (tourist attractions) తీర్చిదిద్దేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారు అందించారు.

Hyderabad step wells । పూర్వ వైభవం పొందనున్న హైదరాబాద్‌ మెట్లబావులు

Hyderabad step wells । మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక భవనాలను (historical buildings) పర్యాటక ప్రాంతాలుగా (tourist spots) తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) చెప్పారు. హైదరాబాద్ నగర సంస్కృతిని (culture) ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతోపాటు పర్యాటకరంగాన్ని (Tourism) కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు పురాతన మెట్ల బావుల (ancient step wells) పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ నదిని  ప్రక్షాళన (cleaning the Musi river) చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా హైదరాబాద్‌లోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరాయని సీఎం అన్నారు.

 

మూడోవారంలోకి శ్రీపెరంబదూర్‌ సాంసంగ్‌ కార్మికుల సమ్మె

ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని (old assembly building) పునరుద్ధరిస్తున్నామని, అందులో త్వరలోనే శాసన మండలిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం శాసనమండలి సమావేశాలు జరుగుతున్న  జూబ్లీ హాల్‌(Jubilee Hall)కు చారిత్ర‌క ప్రాధాన్యం ఉన్నదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని చెబుతూ.. భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని అభిప్రాయ‌ప‌డ్డారు. జూబ్లీహాల్‌ను దత్తత తీసుకొని పరిరక్షించాలని సీఐఐకి  ముఖ్యమంత్రి సూచించారు. ఉస్మానియా హాస్పిటల్‌ భవంతిని పరిరక్షిస్తామని, దీనికోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)ని గోషామహల్ స్టేడియానికి (Goshamahal Stadium) తరలిస్తున్నట్లు వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరముందని అన్నారు. రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవనం నిర్మాణం (new High Court building) కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ (Hyderabad City College) భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి పలు చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసర‌ముందని చెప్పారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.

 

నెమ‌లి ఈకను ఇంట్లో ఉంచ‌డం శుభ‌ప్ర‌ద‌మేనా..? ఏ దిశ‌లో ఉంచితే మంచిది మ‌రి..!

పురాతన బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు 

హైదరాబాద్‌లోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి, పర్యాటక ప్రాంతాలుగా (tourist attractions) తీర్చిదిద్దేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారు అందించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి(Mahalakha step well)ని పునరుద్ధరించేందుకు ఇన్ఫోసిస్‌ ముందుకు వచ్చింది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకున్నది. సాలార్ జంగ్, అమ్మపల్లి బావుల‌ను పునరుద్ధరిస్తామని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. అడిక్‌మెట్ మెట్ల బావి(Addikmet step well)ని  దొడ్ల డైరీ, ఫలక్ నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నాయి.

 

దేవ‌ర రివ్యూ.. ఎర్ర స‌ముద్రం పోటెత్తింది.. థియేట‌ర్లలో మాస్ జాత‌రే..

 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని.. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణ దర్శిని (Telangana Darshini) కార్యక్రమాన్ని తీసుకువచ్చామ‌ని తెలిపారు. దానికి సంబంధించిన జీవోను ఇప్ప‌టికే జారీ చేశామని చెప్పారు. చారిత్ర‌క‌, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన (awareness) కల్పించే ఉద్దేశంతో తెలంగాణ దర్శిని తీసుకొచ్చినట్లు సీఎం  వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.