హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలి
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఆమ్రపాలి

- జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ
- సీఎస్ శాంతికుమారి ఉత్వర్వులు
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన కాటా ఆమ్రపాలి (2010 బ్యాచ్)ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్‌తోపాటు.. మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న బీ గోపీ (2016 బ్యాచ్)ని వ్యవసాయ సంచాలకుడిగా, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి (1999 బ్యాచ్)ని పూర్తి అదనపు బాధ్యతలతో టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్‌కో సీఎండీగా, ఐటీఈ అండ్ సీ జాయింట్ సెక్రెటరీ సందీప్ కుమార్ ఝాను టీఎస్ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
తెలంగాణ సదరణ్ పవర్ డస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీని, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా నియమించారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఓఎస్‌డీగా డి.కృష్ణ భాస్కర్ (2012 బ్యాచ్)ను నియమించారు.