దోచుకున్న సొమ్ముతో కోట్ల రూపాయల యాడ్స్ : కవితపై ఇందిరా శోభన్ ఫైర్

ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ..అయినా కల్వకుంట్ల కవితకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే స్థోమత..కోట్లాది రూపాయల యాడ్స్ ఇవ్వడం ఎలా సాధ్యమో తెలంగాణ సమాజానికి చెప్పాలని కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన నిలదీశారు. దీనిపై కవితక్కా జవాబు ఇవ్వు అంటూ ఓ వీడియో విడుదల చేశారు.

దోచుకున్న సొమ్ముతో కోట్ల రూపాయల యాడ్స్ : కవితపై ఇందిరా శోభన్ ఫైర్

విధాత, హైదరాబాద్ : ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ..అయినా కల్వకుంట్ల కవితకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే స్థోమత..కోట్లాది రూపాయల యాడ్స్ ఇవ్వడం ఎలా సాధ్యమో తెలంగాణ సమాజానికి చెప్పాలని కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన నిలదీశారు. దీనిపై కవితక్కా జవాబు ఇవ్వు అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అనేక జాతీయ, ప్రాంతీయ పత్రికలు..టీవీ ఛానెళ్లకు కవిత కొత్త పార్టీ ప్రకటన సందర్బంగా కోట్లాది రూపాయల యాడ్స్ ఇవ్వడంపై ఆమె కవితకు పలు ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కవిత సంపాదించిన అక్రమాస్తులకు కొత్త పార్టీ స్థాపన, ఇచ్చిన యాడ్స్ నిదర్శనంగా చూడవచ్చని ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి, అవినీతికి కవిత యాడ్స్ నిదర్శనం అన్నారు. కవిత ఇచ్చిన యాడ్స్ కు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో..ఎలా వాటికి డబ్బులు చెల్లించారో ఆమె పారదర్శకంగా తెలంగాణ సమాజానికి వెల్లడించాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు.

కొత్త పార్టీ ప్రకటన సందర్బంగా కేసీఆర్ ను మర మనిషి అనే మాత్రమే అని చెప్పి, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అంటూ విమర్శించిన తీరు చూస్తుంటే కేసీఆర్ వ్యూహాంలో భాగంగానే కవిత పార్టీ వచ్చిందని అర్ధం అవుతుందన్నారు. నియంత మాదిరిగా, దొరల మాదిరిగా, గడీల పాలన సాగించిన కేసీఆర్ కే హిట్లర్ పోలిక సరిపోతుందని ఇందిరా శోభన విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ప్లాన్ ప్రకారం పుట్టుకొచ్చిన కవిత పార్టీ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.