IT Raid on Ranjith Reddy | బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సంస్థల్లో ఐటీ సోదాలు!
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్న డీఎస్ఆర్ గ్రూపు సంస్థలపై ఐటీ శాఖ మంగళవారం ఉదయం నుండి సోదాలు చేపట్టింది.

IT Raid on Ranjith Reddy | విధాత,హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్న డీఎస్ఆర్ గ్రూపు సంస్థల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు సంస్థ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్, సీఈవో సత్యనారాయణరెడ్డి ఇల్లు, ఆఫీసులు సహా మొత్తం 11చోట్ల తనిఖీలు చేపట్టారు. చైన్నై, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్సార్ నగర్, సూరారంలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.
ఐదేళ్ల ఐటీ వ్యవహారాల్లో తేడాల నేపథ్యంలో ఐటీ సోదాలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. గతంలో ఫిల్మ్ నగర్ లో డీఆర్ఎస్ తో కలిసి పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగస్వామిగా ఉన్నారు.