ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా యోచన … పార్టీలో గౌరవం లేదని మనోవేదన
ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోజనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తన నియోజకవర్గం జగిత్యాల బీఅరెస్ ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల తనకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని జీవన్ రెడ్డి అవమానంగా భావిస్తున్నారు.
విధాత : ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోజనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తన నియోజకవర్గం జగిత్యాల బీఅరెస్ ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల తనకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని జీవన్ రెడ్డి అవమానంగా భావిస్తున్నారు. మంగళవారం హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జిల్లాలోని నా అనుచరులను కాంగ్రెస్ కార్యకర్తలను గాంధీభవనకు రమ్మని పిలవడం జరిగిందన్నారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ పార్టీ మార్పుపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనను బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరూ సంప్రదించలేదన్నారు. నా ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందని, పదవికి రాజీనామా చేసి జిల్లాలో పల్లెపల్లెలో తిరుగుతానని చెప్పారు. ప్రజల కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి పార్టీ ఏం చెబితే అది చేశాను అన్నారు. ఇన్నేళ్లు ఎవరి మీద కొట్లాడానో వారిని నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారని మండిపడ్డారు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్థాపానికి గురవుతున్నారు అన్నారు ఉదయం టీవీలో చూసి ఎమ్మెల్యే సంజయ్ చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు 40ఏండ్ల నా సీనియారిటీకి పార్టీ అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకంటూ భావోద్వేగానికి లోనయ్యారు. శాసనసభలో తగిన సంఖ్య బలం ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని తప్పు పట్టారు. స్థానిక పార్టీ కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్షంగా చేరికల పై నిర్ణయం తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనతో మాట్లాడారని జీవన్ రెడ్డి చెప్పారు. బీజెపి నుంచి తనను ఇప్పటికైతే ఎవరు సంప్రదించలేదని స్పష్టం చేశారు.
జీవన్ రెడ్డి ఇంటికి భట్టి.. శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల అసంతృప్తికి మనస్థాపానికి గురైన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి డి. శ్రీధర్ బాబులు ఆయన ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్సీ పదవికి.. పార్టీకి రాజీనామా చేయకుండా జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram